"Prajalaara, Desha Prajalaara" Telugu song Lyrics

 

Song Title :  "Prajalaara, Desha Prajalaara" 

Lyrics By : Venu Accha

Song Description : A patriotic song to unite the people of country to work together in order to build a better and stronger nation by gaining knowledge and expertise to compete with other nations and win in each and every field.


🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

SONG LYRICS

🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

ప్రజలారా, దేశ ప్రజలారా

ప్రజలారా, తోటి దేశ ప్రజలారా

కలపండి చేతులు కలిసికట్టుగ బతుకుదాం

ఒక్కటై మనమంతా ఒక తాటిపై నడుద్దాం

కృషినే నమ్ముకుంటూ మనుగడ సాగిద్దాం

పట్టుదలతో కష్టించి భావి భారతాన్ని నిర్మిద్దాం

పూల బాటలు వేసి మేటి దేశం అంటూ చాటేద్దాం 

ప్రజలారా, దేశ ప్రజలారా || 



ప్రజలారా, దేశ ప్రజలారా

స్వాతంత్రపు గాలులు ఊపిరులు ఊదగా


సాగుదాం సాగుదాం

బతుకు విలువ తెలుసుకుంటు మునుముందుకు సాగుదాం


ఎదుగుదాం ఎదుగుదాం

విజ్ఞానం పెంపొందించుకుంటు  పై పైకి ఎదుగుదాం


సాధిద్దాం సాధిద్దాం

చేసే ప్రతి పనిలో నైపుణ్యము సాధిద్దాం  


చేరుదాం  చేరుదాం

అడుగు అడుగు వేసుకుంటు శిఖరాగ్రం చేరుదాం

ప్రజలారా, దేశ ప్రజలారా || 



ప్రజలారా, దేశ ప్రజలారా

గణతంత్రపు రాజ్యాంగం దిశను చూపగా


ఏకం చేద్దాం ఏకం చేద్దాం

ఏటికి ఎదురీదయినా నింగినేల ఏకం చేద్దాం


ఎగరేద్దాం ఎగరేద్దాం

ఎందులో తక్కువంటు పౌరుషాల జెండా ఎగరేద్దాం


తలబడదాం తలబడదాం 

గెలుపే లక్ష్యంగా అన్ని పోటీల్లో తలబడుదాం


పెంచుదాం పెంచుదాం

ప్రపంచాన భారత సంతతి ప్రతిష్ట పెంచుదాం

ప్రజలారా, దేశ ప్రజలారా ||


                🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝



   🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

Prajalaara , (Toti) Desha Prajalaara

kalapandi chetulu Kalisi kattuga batukudaam

okkatai Manamanthaa Oka taatipaina naduddaam

Krushine nammukuntu manugada konasaagiddaam/ saagiddaamu

Samishtigaa manandarikosam Pranaalikalu roopondiddaam 

Pattudalatho amaluparichi Bhaavi bhaarathaanni nirmiddaam

Poola baatalu vesi meti desham antu chaateddaam 



Prajalaaraa, Desha Prajalaara

Swaatantrapu gaalulu oopirulu oodagaa


Saagudaam Saagudaam

Batuku viluva telusukuntu munumunduku saagudaam


Edugudaam Edugudaam

Vignanam pempondinchukuntoo pai paiki edugudaam


Saadiddam Saadiddaam 

chese prati panilo Naipunyam Saadiddaam  


Cherudaam Cherudaam

Adugu adugu vesukuntu Shikaraagram Cherudaam


Prajalaaraa, Desha Prajalaara

Ganatantrapu raajyaangam dishanu choopagaa


Ekamcheddaam Ekamcheddaam

etiki edureedainaa Ninginela Ekamcheddaam


Egareddaam Egareddaam

Endulo takkuvantu Pourushaala Jendaa Egareddaam


Talabadadaam Talabadadaam

Gelupe lakshamgaa anni poteello talabadudaam


Penchudaam Penchudaam

prapanchaana baaratha santati pratishta penchudaam


   🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝


Comments

Popular posts from this blog

'Yuvatha O Yuvatha' song lyrics in Telugu

"Yedo Majaa" Telugu song Lyrics

'Happy New Year' Song Lyrics in Telugu

"Summer Holidays" Kids Song Lyrics in Telugu