'రయ్, రయ్, రా' Song Lyrics

Song Title : 'రయ్, రయ్, రా'

Lyrics By : Venu Accha 

Song Description : A song written inspired listening to a Telugu film song. Its an inspirational song motivating oneself to work for his passion, aim high and fulfill their dreams in a way leaving a mark and receive applause from people.

I wrote the song in just few hours once I started. and Its the first song I wrote  which has 3 charanams. 

Listen to the song :



SONG LYRICS

రయ్, రయ్, రా,…. రా, రా.
రయ్, రయ్, రా,…. రా, రా.

దూసుకొచ్చెయ్ రా,
రామ బాణం నువ్వై,
లక్ష్యాన్ని ఛేదించాలిరా.

తెగించొచ్చేయ్ రా,
నిన్నెవడు ఆపేనంటూ,
ఏదీ నీకడ్డు కాకూడదురా.

దిక్కులు పిక్కటిల్లే శక్తి నువ్వు అవ్వాలిరా,
నలుగురు హర్షించే మనిషిగా నువ్వు ఎదగాలిరా.
                                         రయ్, రయ్, రా,…. రా, రా !!

నీ జోరు హోరువానలా,
నీ తీరు సుడిగాలిలా,
మార్చి బయలెల్లరా , 
నీ దారి రహదారిగా మారాలిరా .

నీలో ఫైర్ దహించాలిరా,
నీ డేర్ కదిలించాలిరా,
వెరసి వెలగాలిరా,
నీ పేరు ఊరంతా మోగాలిరా. 
                          రయ్, రయ్, రా,…. రా, రా !!

నీ మాట శాసనంలా,
నీ ఆట ఓటమెరుగక,
చరిత సృష్టించాలిరా,
పది మంది ఆదర్శంగా చూడాలిరా.

ఎక్కే మెట్టు పునాదిలా,
చేరే గమ్యం మిన్నవ్వాలిరా,
గెలిచి తీరాలిరా,
మహరాజు తీరుగ బతకాలిరా.
                            రయ్, రయ్, రా, …. రా, రా !!

నీ గేర్ మార్చాలిరా,
నీ స్పీడ్ పెరగాలిరా, 
సర్రున సాగాలిరా,
సంద్రం సైతం నీకు తలొగ్గాలిరా.

నీ కల నెరవేరాలిరా,
నీ పంట పండాలిరా,
నువ్వేంటో చూపాలిరా,
జనం మెచ్చి జేజేలు పలకాలిరా.
                             రయ్, రయ్, రా,…. రా, రా !!








Comments

Popular posts from this blog

Music Player - 1.0

'చకోరి, చకోరి' Song Lyrical

" ఏదో మాయ " Song Lyrics