ఓ చిరు ప్రేమకథ - Short Film Script
Script Title : ఓ చిరు ప్రేమకథ
Written By : Venu Accha (+91 9052360462)
Synopsis : Varun proposes Mahitha after becoming close friends. She doesn't answer in a positive way. though he insists, she asks him not to bring the topic again. Disappointed Varun doesn't meet her for few days. How They come out from that situation and what happens next forms the story.
అప్పుడే నిద్రలేచాడు వరుణ్ ( background లో అమ్మ మాటలు వినిపిస్తున్నాయి).
వరుణ్ బాత్రూంలో స్నానానికి వెళ్లి ఫ్రెష్ అవుతుండగా, ఫోన్ రింగవుతుంది. ఆ కాల్ , తను ప్రేమించిన అమ్మాయి (మహిత) నుండి వచ్చింది .
బయటకి వచ్చి తన మొబైల్ లో మహిత నుండి వచ్చిన కాల్ చూసి ఆ కాల్ ఊహించనందున ఆశ్చర్యం వేసినా మొహం పైన చిరునవ్వు కనిపిస్తుంది. కాని ఎందుకు చేసింది రెండు వారాల ముందు తన ప్రపోసల్ కి ఇష్టం లేదు అని చెప్పింది. ఇప్పుడు దేనికోసం కాల్ చేసింది , తిరిగి కాల్ చేద్దామా వద్దా అని అలోచించి, తనే మల్లి కాల్ చేస్తుందేమో చూద్దాము , కాల్ రాకపోతే రెండు గంటల తరువాత కాల్ చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు.
2 గంటలు మహిత కాల్ కోసం ఎదురుచూసి ,కాల్ చేస్తాడు తనే. మహిత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.
వరుణ్
ఏంటి కాల్ చేసావు.
మహిత
ఎప్పుడో 2 hours back కాల్ చేస్తే ఇంతసేపటికా చేసేది. నా రూమ్మేట్ కి హెల్త్ బాలేదు, నాకు ఆఫీసు లో meeting ఉంది , తనేమో ఫ్లాట్ లో ఒక్కతె ఉంది. తనని హాస్పిటల్ కి తీసుకెళ్ళి డాక్టర్ కి చూపిస్తావేమో అని కాల్ చేసాను.
వరుణ్
మరి ఏం చేసావు.
మహిత
ఇంకేం చేస్తాను నేనే తీసుకెళ్ళి చూపించి మళ్ళి ఫ్లాట్ లో దించి ఇప్పుడే ఆఫీసుకి వచ్చాను.
వరుణ్
I m sorry.
మహిత
it's Ok. నేను తరువాత కాల్ చేస్తాను. Have some work to do. Anyway thanks for calling me back.
మహిత ఆఫీసు నుండి ఫ్లాట్ కి రావడానికి రెడీ అవుతూ తన రూమ్మేట్ కి డిన్నర్ కి ఏమి తీసుకురావాలి అని అడిగేందుకు ఫోన్ చేస్తుంది .
లాస్య
హలో.
మహిత
ఇప్పుడెలా ఉంది.
లాస్య
ok . Feeling some better.
మహిత
సరే,డిన్నర్ కి ఏమి తీసుకురావాలి.
లాస్య
వరుణ్ వచ్చాడు. ఇందాకే ఇడ్లీ తీసుకొస్తే తినేసాను. నువ్వు వచ్చేయ్.
మహిత
Ok.
మహిత ఫ్రెష్ అయ్యి, బయటికి వచ్చింది. లాస్య పడుకుంది అని చూసి, వరుణ్ కి దగ్గరగా చైర్ లో కూర్చుంది. వరుణ్ కి మహిత ప్రపోసల్ రిజెక్ట్ చేసాక ఒంటరిగా ఏమి మాట్లాడాలో తెలీక మౌనం గా వున్నాడు .
మహిత
ఏంటి 2 weeks నుండి కాల్ లేదు. ఏమయి పోయావు.
వరుణ్
( మహితకేసి చూసి, ఎంత బాగా అడుగుతున్నావే, మీకేం తెలుసు నచ్చిన అమ్మాయి ఒప్పోకోకపోతే మేము పడే భాద అని మనసులో అనుకోని) నీకు తెలీదా ఎందుకో.
మహిత
నాకెలా తెలుస్తుంది.
వరుణ్
నా ప్రేమని కాదన్నావు. నేనంటే ఇష్టం లేదు అని చెప్పావు. ఇంకెందుకు కలవాలి. కలిసి భాద పెంచుకో మంటావా.
మహిత
ఫ్రెండ్ లా ఇంతకుముందులా ఉండొచ్చుకదా .
వరుణ్
( మౌనంగా మహిత వైపు మరొక్క సారి చూసి బదులు ఇవ్వటం ఇష్టం లేనట్టు గా మౌనంగా నేను బదులుచెప్పను అన్నట్లుగా తల ఊపుతాడు. ఇద్దరిమధ్యా రెండు నిమిషాల మౌనం. ఆ తరువాత వరుణ్ లేచి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుండగా కొద్ది దూరం వెళ్ళిన తరువాత .
మహిత
ఈ weekend saturday షాపింగ్ కి వెళ్దాము. నువ్వు రా నాతో షాపింగ్ కి .
వరుణ్
నేను రాను.
మహిత
(ఎందుకు అంత డిసప్పాయింట్ అవుతావు అన్నట్లుగా వరుణ్ కేసి చూసి) షాపింగ్ కి .
వరుణ్
నో, రాను. (అని చెప్పి, డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు)
Friday నైట్ వరుణ్ ఇంట్లో laptop లో సాంగ్స్ చూస్తుండగా, మహిత నుండి మెసేజ్ వస్తుంది మొబైల్ కి షాపింగ్ వెళ్ళడానికి remind చేస్తూ. తను ఇంట్లో వూరికే ఉండడంతో వెళ్దాము అని డిసైడ్ చేసుకొని, కాల్ చేసి చెప్తాడు సరే వెళ్దాము అని. అలా కొద్ది రోజులు నార్మల్ గా ఫ్రెండ్స్ లా ఉంటారు. వరుణ్ అప్పుడప్పుడు తన ప్రపోసల్ గుర్తు చేసినా మహిత మాత్రం నేను ఆల్రెడీ చెప్పాను మల్లి ఇంకో సారి అడగొద్దు , I m sorry అన్నట్లుగా పేస్ పెట్టి బదులిస్తుంది.
మహిత
నేను one week మా ఇంటికి వెళ్తున్నాను. Mummy n Dad రమ్మన్నారు.
వరుణ్
1 week ?... ఎందుకు.
మహిత
morethan 3 months అయ్యింది వెళ్లి. రమ్మన్నారు ఇంట్లో.
వరుణ్
(పెళ్లి సంబంధం ఏమైనా చూసారా ఏంటి అనుకోని. అనవసరంగా ఆ టాపిక్ తేవడం ఎందుకు అని మనసులో అనుకోని). అబ్బా, 1 week ఏనా, వెళ్ళు వెళ్ళు. I m happy అంటాడు.
మహిత
ohoo…. అని నవ్వుతుంది.
ఒక వారం తరువాత, మహిత వరుణ్ కి కాల్ చేస్తుంది.
వరుణ్
హాయ్ మహిత, ఎప్పుడొచ్చావు.
మహిత
ఈ రోజు ఉదయం. సరే కాని, తొందరగా నా ఫ్లాట్ కి వస్తావా.
వరుణ్
ఇప్పుడంటే ఇప్పుడా. ఏంటి అంత అర్జంట్.
మహిత
ఏం busy aa.
వరుణ్
ఇంకేం అడక్కు, వస్తున్నాను సరే నా.
Half an hour లో రెడీ అయ్యి, మహిత ఫ్లాట్ కి వెళ్తాడు. డోర్ బెల్ ప్రెస్ చెయ్యగానే, డోర్ తీస్తుంది మహిత. మహిత నీట్ గా డ్రెస్ up అయ్యి రెడీగా ఉండడం చూసి,
వరుణ్
ఆల్రెడీ బయటకి వెళ్ళడానికి రెడీ అయినట్టునావు . ఇంకేంటి పద వెళ్దాము. ఎక్కడికో చెప్పు .
మహిత
బయటకి వెళ్ళడానికి రెడీ అవ్వలేదు.
మహిత అలా బదులిస్తూ వరుణ్ ని లోపలికి రా అన్నట్లు సైగ చేసి తనతో తీసుకెళ్ళి , బాల్కనీ లో చైర్ లో కూర్చుని ఉన్న తన తండ్రి దగ్గరికి తీసుకెళ్తుంది.
మహిత
(వరుణ్ ని చూపిస్తూ) Dad, వరుణ్ అని మీతో చెప్పాను.వరుణ్ Good evening అంకుల్.
Mahitha's ఫాదర్
Good evening. ( చైర్ కేసి చూపిస్తూ) కూర్చో బాబు.
చైర్ లో కూర్చుంటూ స్మైల్ చేస్తాడు వరుణ్ అంకుల్ కేసి చూస్తూ.
మహిత
మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కాఫీ తీసుకొస్తాను.
Mahitha's ఫాదర్
(మహిత కి సరే వెళ్ళు అన్నట్లుగా తల ఊపి , వరుణ్ వైపు మరలి) ఏం చేస్తుంటావు.
వరుణ్
నేను software ఇంజనీర్ గా జాబు చేసాను, ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను . It might take some more time for things to get settle.
Mahitha's ఫాదర్
ok. మహిత నీ గురించి చెప్పింది. ప్రేమిస్తున్నావు అని. తను నా ఇష్టం అని డెసిషన్ నాకు వదిలేసింది. తనకి ఇష్టం లేకుండా నా వరకు తీసుకొని రాదు. అందుకే, నీతో మాట్లాడుతాను రమ్మని చెప్పా.
వరుణ్
(ఆశ్చర్య పోయినా) ok ( low voice లో).
ఆ తరువాత మహిత ఫాదర్ వరుణ్ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అడగడం, వరుణ్ ఆయన అడిగిన వాటికి బదులిస్తుండగా, కాఫీ తీసుకొస్తుంది మహిత. వరుణ్ కి, ఫాదర్ కి కాఫీ ఇచ్చి తను కూడా తీసుకొని వారి conversation లో జాయిన్ అవుతుంది. మధ్యలో వరుణ్ కి తనతో ఒంటరిగా ఆనందం షేర్ చేసుకోవాలి అన్న ఆశ కళ్ళల్లో కనిపిస్తున్నా, ఫాదర్ అక్కడే ఉండడం తో వరుణ్ కంట్రోల్ చేసుకుంటున్న తీరు చూసి ముచ్చటేస్తుంది.
కొద్ది సేపటి తరువాత, వరుణ్ తను బయలుదేరుతున్నాను అని చెప్పి, మహిత ని తనతో బయటి వరకు రమ్మంటాడు. ఫాదర్ పర్మిషన్ కోసం అన్నట్లుగా చూసి, సరే వెళ్ళు అన్నట్లుగా తండ్రి చెప్పడం తో,
మహిత
(వరుణ్ వైపు మల్లి) పద వెళ్దాము.
వరుణ్
నువ్వు అబద్దం చెప్పావు నాకు అయితే.
మహిత
నేనా నీకా.
వరుణ్
నన్ను లవ్ చెయ్యట్లేదు అన్నావు, నేనంటే ఇష్టం లేదన్నావు . ఎంత బాధ పడ్డానో తెలుసా .
మహిత
వెంటనే ఆన్సర్ ఇవ్వడానికి మేమెంత ఆలోచించాలో తెలుసా. అయినా , ఈ రోజుల్లో ఒక అమ్మాయి పడకపోతే, వెంటనే ఇంకో అమ్మాయికి షిఫ్ట్ అవుతారు కదా. నువ్వూ ఎవరినైనా try చేసి ఉంటావు, నాకు చెప్పలేదు కాని.
వరుణ్
నేను, ఇంకో అమ్మాయిని. అయినా, నువ్వు నన్ను ఆ పరిస్థితి కి తీసుకురానియ్యవులే .
వరుణ్ అలా అని మహిత కేసి చూడగానే, మహిత కూడా వరుణ్ ని చూస్తుంది. ఇద్దరూ హ్యాపీగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తారు.
The End

Comments
Post a Comment