"రాజకుమార, రాజకుమార" Telugu song lyrics
Listen to the song :
SONG LYRICS
రాజకుమార, రాజకుమార,
రాజా, రాజా, రాజకుమార.
నా మదిలో మోగించావు విజయ ఢంకా.
నా యదలో అధిష్టించావు సింహాసనం.
ఊహల పల్లకిలో నా మనసు ఊరేగుతుంది రోజంతా.
తుళ్లింత ఊయలలో తేలి ఆడి ఊగుతుంది తనువంతా.
రాజకుమార, రాజకుమార
రగులుతోంది నాలో ప్రేమ జ్వాల
కురుస్తోంది నాపై వలపుల వాన
రాజా, రాజా, రాజకుమార.
రాజకుమార రాజకుమార ||
చిలిపి నవ్వుల రాజసం నీదేనులే,
చూడగానే పడిపోయాను.
కొంటె కవ్వింపుల దర్పం బాగుందిలే,
ఎంతగానో నచ్చేసావు.
నా పడుచు ప్రాయం నిన్నే కోరుతుందిలే.
నన్ను యేలేవాడివి నువ్వే అంటుందిలే.
రాజకుమార రాజకుమార ||
ఇద్దరి మనసుల రాయబారం చాలులే,
యుద్ధాలేవి అక్కర్లేదు.
నోటి పిలుపుతో ఆహ్వానం అందించులే,
దండయాత్రల పనిలేదు.
నా చిన్ని రాజ్యం నీలో కలిపేస్తాలే.
నీ ఆధీనంలో నేను బతికేస్తాలే.
రాజకుమార రాజకుమార ||
💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃
Comments
Post a Comment