Write up in Telugu on the premise 'Earth 1002025' .
కాలం ఆగదు.
లోకం మారదు
జరిగేది తెలీదు .
ఉపద్రవం చెప్పి రాదు.
అద్భుతాలు జరిగేటప్పుడు తెలీదు.
ఏ క్షణం మనది కాదు.
విశ్వంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో.
మన దాకా వస్తే కాని అర్దం అవ్వనివి ఎన్నెన్నో .
మనుషులం మనం మనుషులం.
చదువు, ఉద్యోగ బాధ్యతలు, స్నేహం, ప్రేమ, పెళ్లి, పిల్లలు , సంఘం కట్టుబాట్లు ఇలా ఎన్నో మనను కట్టిపడేస్తాయి.
ఇలాంటి చట్రంలోనే బ్రతికేసే బాపతు జీవితాలే అన్నీ లోకంలో.
ఇంకా వేరే ఏముంటుంది.
ఇంకా ఏం సాధించాలి.
ఇంతకన్నా కొత్తగ ఏముంటుంది.
మన చేతుల్లో ఏముంది.
మనం చెయ్యగలిగింది ఏముంది.
అంతా ఎప్పటికైనా ముగిసేదే కదా.
అలా అని బ్రతుకు మీద ఆశ చావదుగా.
కొత్తగా ఏమైనా కలలు కందామా.
ఏమైనా కొత్త రంగులు పులుముకుందామా.
చెప్పరా ఎవరైనా, ................ మీలో ఒకరైనా.

Comments
Post a Comment