"రావయ్యా వినాయక" - Song Lyrical
Song Title : " Raavayyaa Vinayaka " .
Lyrics By : Venu Accha (Contact : +91 9052360462)
రావయ్యా వినాయక
మూషిక వాహన వినాయక రావయ్యా…….దిగిరావయ్యా.
రావయ్యా వినాయక
గజ ముఖ వినాయక రావయ్యా…….దిగిరావయ్యా.
మా సేవలు అందుకోగ రావయ్యా,
మా పూజలు పండించగ రావయ్యా,
నీ దీవెనలు అందించగ దిగిరావయ్యా.
ఓ వినాయక,
నీ పండుగ వైభోగం చూడగ రావయ్యా …….దిగిరావయ్యా.
రావయ్యా వినాయక||
ఓ బొజ్జ గణపయ్య,
నీ రాకతో,
చిన్నా పెద్ద అంతా కలిసి
సందడిగా నీ పండుగ జరిపెము.
ఆటాపాట చేర్చి
ఉల్లాసంగా పెద్ద వేడుక చేసేము.
నింగీనేల అదిరేలా
పసందుగా ఎన్నో సంబరాలు జరిపేము.
అంగరంగ వైభవంగ చేసేము నీ పండుగ...చూడవయ్యా ఓ వినాయక.
రావయ్యా వినాయక||
ఓ విఘ్నేశ్వరా,
నీ చెంతన,
ఊరూ వాడ మొత్తం కూడి,
భక్తితో రోజూ పూజలు చేసేము.
ధనికపేద భేదం మరిచి,
మనస్ఫూర్తిగా నీ సేవలో గడిపేము.
భక్తి భావం మనసున నింపి,
నిమజ్జనం చేసేదాకా నిన్నే స్మరించేము.
ప్రతివారి కనులవిందుగ జరిపేము నీ పండుగ....చూడవయ్యా ఓ వినాయక.
రావయ్యా వినాయక||
Comments
Post a Comment